TRINETHRAM NEWS

Singareni colliery officials for Telangana flood victims

ఉద్యోగుల తమ ఒకరోజు బేసిక్ జీతం 10.25 కోట్ల ను విరాళంగా ప్రకటించారు.

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గురువారం ఈ చెక్కును గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి ఎనర్జీ సెక్రటరీ రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ . తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ జనక్ ప్రసాద్ గుర్తింపు, ప్రాతినిధ్య కార్మిక సంఘాల నాయకులు, అధికారుల సంఘం నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య, ధర్మపురి లక్ష్మీపతి గౌడ్ తదితరులు అందజేశారు.
వరద తెలంగాణ ప్రజల కోసం రాష్ట్రం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయ చర్యలకు తోడ్పాటుగా ఈ వితరణ ప్రకటించామని, గతంలో కూడా పలు ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విరాళాలు అందజేశామని వారు పేర్కొన్నారు.

సింగరేణి ఉద్యోగులు, అధికారులు తమ ఒకరోజు బేసిక్ వేతనాన్ని వరద బాధితుల కోసం విరాళంగా అందజేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ కె.రాజ్ కుమార్,ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ శ్రీ సి.త్యాగరాజన్, వికాస్ కుమార్ యాదవ్ , అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ నర్సింహులు, జీఎం(కో ఆర్డినేషన్) ఎస్.డి ఎం.సుభాని, జీఎం(పర్సనల్) కవితా నాయుడు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Singareni colliery officials for Telangana flood victims