TRINETHRAM NEWS

CM Revanth and Deputy CM Bhatti Vikramarka announced profit share for Singareni workers

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

2023–24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి రూ.4,701 కోట్ల లాభాలు సాధించింది.

పెట్టుబడులు పోగా రూ.2,412 కోట్ల లాభాల్లో 30 శాతం వాటాగా రూ.796 కోట్లు కార్మికులకు పంచుతున్నాం.

ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 90 వేలు వస్తాయి. నిరుడు రూ.లక్షా 70 వేలు ఇవ్వగా, ఈసారి రూ.20 వేలు ఎక్కువ ఇస్తున్నాం.

సింగరేణిలో 41,837 రెగ్యులర్ ఎంప్లాయీస్, 25 వేల మంది కాంట్రాక్టు వర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటివరకు రెగ్యులర్ ఎంప్లాయీస్కు మాత్రమే లాభాల్లో వాటా పంచారు.
సింగరేణి యూనియన్లు, మేనేజ్మెంట్, రాష్ర్ట ప్రభుత్వం మానవతాదృక్పథంతో ఆలోచించి కాంట్రాక్టు వర్కర్లకు ఒక్కొక్కరికి రూ.5వేలు బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది.
లాభాల వాటా దసరా పండుగకు ముందే అందజేస్తాం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Revanth and Deputy CM Bhatti Vikramarka announced profit share for Singareni workers