Donors should come forward for food donation program as inspiration of Anna canteens
ఇప్పటి వరకూ 175 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం… మొత్తం 203కు పెంచుతాం
పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందిస్తున్నాం
బుడమేరు వరద బాధితులకు మెరుగైన ప్యాకేజీని ఇచ్చి ఆదుకున్నాం
తిరుమల తిరుపతి ప్రతిష్టను గత ప్రభుతం దెబ్బతీసింది…టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం
—ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
Trinethram News : అమరావతి: పేదవాని ఆకలి తీర్చేందుకు ఎంతో పవిత్ర లక్ష్యంతో చేపట్టిన అన్న క్యాంటీన్ల ద్వారా అన్న దానం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వీటిని సూర్తిగా తీసుకుని సమాజంలోని దాతలు కూడా అన్ని విధాలా ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.గురువారం రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ను సియం ప్రారంభించి ప్రజలకు స్వయంగా అన్నం వడ్డించారు.
అనంతరం అక్కడ ఉన్న కొంత మంది మహిళలు, ఆటో డ్రైవర్ తదితరులతో సియం కొద్దిసేపు మాట్లాడారు.అన్న కాంటీన్ ద్వారా అందిస్తున్న అన్నం ఇతర వంటకాలు ఏవిధంగా ఉన్నాయని అడగ్గా భోజనం చాలా బాగుందని 5రూ.లకే మంచి ఆహారాన్ని అందించడం పట్ల వారు సింయకు ధన్యవాదాలు తెలియజేశారు.గత 5ఏళ్ళ కాలంలో అన్న క్యాంటీన్లు లేక భోజనం కోసం అనేక ఇబ్బందులు పడ్డామని వారు సియంకు వివరించారు.
అనంతరం సియం చంద్రబాబు అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని గతంలో ఉన్న 203 క్యాంటీన్లను పూర్తిగా పునరుద్దరిస్తామని చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి ఉండేలా పట్టణాల్లో అయితే మరిన్ని అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తెస్తున్నట్టుతెలిపారు.పూటకు కేవలం 5రూ.లకే రుచికరమైన,పౌష్ఠికాహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ప్రాంతంలో మూడు పూటలు కలిపి 15రూ.లకే అందిస్తున్నామని దేశంలో ఎక్కడా ఈవిధంగా లేదని అన్నారు.పేదవాడి ఆకలి దప్పులు తీర్చేందుకు ప్రజలకు అందుబాటులో ఉండే అన్న క్యాంటీన్లు గత ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందని అన్నారు.
గత ప్రభుత్వం పవిత్రమైన తిరుమల తిరుపతిని అపవిత్రం చేసింది-ప్రక్షాళన ప్రారంభించాం.
తిరుమలలో గత ప్రభుత్వం భక్తులకు నాసిరకం భోజనం పెట్టి తిరుమల తిరుపతి పవిత్రతను దెబ్బతీయడమే గాక భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రసాదం తయారీలో నాసిరకమైన ముడి సరుకులను వాడారని ఇందుకు సంబంధించి ఆధారాలు దొరికిన తర్వాత బాధ్యులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి హిందువులకు కలియుగ ప్రత్యక్ష దైవమని అలాంటి తిరుమలను గత ప్రభుత్వం పూర్తిగా అపవిత్రం చేసిందని తిరుమల ప్రక్షాళనను ప్రారంభించామని అన్నారు.
వరద బాధితులకు మానతాదృక్పదంతో మెరుగైన ఫ్యాకేజిని అందించి ఆదుకుంటున్నాం
విజయవాడ బుడమేరు వరద బాధితులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మరీ ముఖ్యంగా తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడని రీతిలో మానవతా దృక్పధంతో మెరుగైన ఫ్యాకేజిని అందించి అన్ని విధాలా ఆదుకుంటున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.జగన్ ప్రభుత్వం బుడమేరును పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతోనే వరద పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందని 10 రోజుల పాటు అధికార యంత్రాంగమంతా బాధితులకు అండగా ఉండి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించి ఆదుకుందని చెప్పారు.
ఇళ్ళచుట్టూ నీరు చేరిన గ్ర్రౌండ్ ప్లోర్ కుంటుంబాలకు 25 వేల రూ.లు, మొదటి ప్లోర్ వారికి 15వేలు,ఆపైగల వారికి 10వేల రూ.లు వంతున పరిహారం ఇవ్వడంతో పాటు వరద బాధితులందరికీ 25 కిలోల బియ్యంతో కూడిన 6 రకాల పలు నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను అందించి ఆదుకున్నట్టు సియం తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని తాను ఇచ్చిన పిలుపునకు స్పందించి గతంలో ఎన్నడూ లేని విధంగా ధాతలు పెద్దఎత్తున సియం సహాయ నిధికి విరాళాలు అందించడం పట్ల రాష్ట్ర ప్రజలందరి తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు సియం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.ఇప్పటి వరకూ సియం సహాయ నిధికి 350 కోట్ల రూ.ల వరకూ విరాళాలు అందాయని అన్నారు.
బుడమేరు ఆధునీకరణకు గతంలో రూ.150 కోట్లు మంజూరు చేస్తే గతం ప్రభుత్వం రద్దుచేసింది
గతంలో తాను సియంగా ఉండగా బుడమేరు ఆధునీకరణకు 5 పనులకు గాను 150 కోట్ల రూ.లను మంజూరు చేస్తే గత జగన్ ప్రభుత్వం ఆపనులను రద్దు చేయడంతో పాటు పలు ఆక్రమణలకు పాల్పడంతో నేడు బుడమేరుకు వరదలు వచ్చి ప్రజలు అనేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందని సియం చంద్రబాబు పేర్కొన్నారు.బుడమేరు ద్వారా మరలా వరదలు రాకుండా బుడమేరు ఆధునీకరణకు పెద్దఎత్తున చర్యలు తీసుకుంటున్నామని సియం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈకార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ, ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,గుంటూరు జిల్లా కలక్టర్ నాగలక్ష్మి,సిడిఎంఏ హరినారాయణ,జెసి భార్గవ్ తేజ్,ఎంఎల్సి పి.అనురాధ, తాడికొండ ఎంఎల్ఏ టి.శ్రావణ్ కుమార్, హరేకృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App