జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 16 at 12.51.46

TRINETHRAM NEWS

Police Outpost started by CP

రామగుండం పోలీస్ కమీషనరేట్

పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ప్రారంభించిన సీపీ

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ గోదావరి బ్రిడ్జ్ వద్ద ఇటీవల నిర్మించిన పోలీస్ అవుట్ పోస్ట్ కంట్రోల్ రూమ్ ను ఈరోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., ఇతర పోలీస్ అధికారులతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ…గోదావరి నది బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన ఆవుట్ పోస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు పోలీసు పర్యవేక్షణ కోసం ప్రత్యేక పోలీసు సిబ్బందితో పాటు ఇరువైపులా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా పోలీస్ కంట్రోలింగ్ సిస్టం కొనసాగిస్తామన్నారు. తద్వారా బ్రిడ్జిపై ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్న వాటిని క్లియర్ చేసేందుకు రివర్ గార్డ్ పోలీసులు సిద్ధంగా ఉంటారన్నారు. గోదావరి నది వద్ద ఎలాంటి ప్రమాదాలు జరిగినా క్షణాల్లో కాపాడేందుకు అన్ని రకాల పరికరాలతో పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.

సీపీ వెంట అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నర్సింహులు, ఏ ఆర్ ఏసీపీ సురేంద్ర, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, ఆర్ఐ లు దామోదర్, వామన మూర్తి, సంపత్, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police Outpost started by CP

2 thoughts on “Police : పోలీస్‌ అవుట్‌ పోస్ట్‌ ప్రారంభించిన సీపీ

Comments are closed.

You cannot copy content of this page