Release of MBBS Convenor Quota Seats in AP
ఏపీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు
రాష్ట్రంలో 35 మెడికల్ కళాశాలలు
2024-25 విద్యాసంవత్సరానికి వర్తించేలా సీట్ల కేటాయింపు
Trinethram News : ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను విడుదల చేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నేడు (సెప్టెంబరు 15) ఓ ప్రకటన చేసింది. ఏపీలో 35 మెడికల్ కాలేజీలు ఉండగా… 2024-25 విద్యా సంవత్సరానికి వర్తించేలా కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించారు.
అన్ని మెడికల్ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు- 3,879
ప్రత్యేక కేటగిరీ సీట్లు- 267 (స్పోర్ట్స్, ఎన్ సీసీ, పీహెచ్ సీ, క్యాప్)
మొదటి విడత కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉండే సీట్లు- 3,612
వీటిలో కాలేజీల వారీగా భర్తీ అయిన సీట్లు- 3,507
మిగిలిన సీట్లు- 105
వీటిలో మైనారిటీ వర్గాలకు కేటాయించిన సీట్లు- 102
స్కౌట్స్ అండ్ గైడ్స్ కు కేటాయించిన సీట్లు- 3
కీలక తేదీలు…
ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన 3,507 మంది విద్యార్థులు
కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాల్సిన తేదీ- సెప్టెంబరు 19 (మధ్యాహ్నం 3 గంటల లోపు)
ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు- అక్టోబరు 1న ప్రారంభం
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App