Road Accident : చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం

TRINETHRAM NEWS

Another fatal road accident in Chittoor district

Trinethram News : చిత్తూరు జిల్లా సెప్టెంబర్ 14
చిత్తూరు జిల్లాలో నిన్న 8 మంది మృతి చెందిన సంఘటన మరువక ముందే ఈరోజు ఉదయం బంగారుపాళ్యం సమీపంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు గాయపడినట్లు తెలుస్తోంది.

బెంగళూరు నుంచి తిరుపతికి దైవ దర్శనానికి బెంగళూరు దొడ్డబల్లాపుర నుండి ఒక ఫ్యామిలీ శనివా రం తెల్లవారు జామున బయలు దేరింది.ఉదయం ఏడున్నర గంటల ప్రాంతం లో బంగారుపాళ్యం చేరుకుంది.

వారు ప్రయాణం చేస్తున్న ఇన్నోవా కారు టైరు పేలడంతో బంగారుపాళ్యం ప్లై ఓవర్ బ్రిడ్జిపైన ప్రమాదం జరిగింది. కారు అదుతప్పి బోల్తాపడి 7 పల్టీలు కొట్టింది. దీంతో కారు నుజ్జు అయ్యింది.

కారులోని బెంగళూరుకి చెందిన గంగయ్య 56, లక్ష్మీ 35 అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీనివాసమూర్తి 51, సుచిత్ర 48, ఉష 32, ధరణి 22 గాయపడ్డారు. ప్రమాద సంఘటన తెలియగానే బంగారు పాళ్యం ఎమ్మార్వో బాబు రాజేంద్రప్రసాద్, బంగారు పాళ్యం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ రాంభూపాల్ అక్కడికి చేరుకున్నారు.

మృతదేహాలను బంగారుపాళ్యం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారికి బంగారుపాళ్యం ఆస్పత్రిలో ప్రధమ చికిత్స చేసి అనంతరం పోలీసులు కోలారు ఆస్పత్రికి తరలించారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Another fatal road accident in Chittoor district

1 thought on “Road Accident : చిత్తూరు జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం”

  1. Pingback: Fatal Road Accident : అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు యువకులు మృతి - TRINETHRAM NEWS

Comments are closed.

You cannot copy content of this page

Scroll to Top