TRINETHRAM NEWS

Sitaram Yechury’s death is a great loss for the working class-CITU

సీతారాం ఏచూరి కి సిఐటియు నివాళి
కమ్యూనిస్టు దిగ్గజం కార్మిక వర్గ నాయకుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి నిన్న అనారోగ్యంతో మరణించారు,వారి చిత్రపటానికి

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సిఐటియు జిల్లా కమిటీ, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు, ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు మెండే శ్రీనివాస్, మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుండే ప్రజా పోరాటాల్లో రాటు దేలరని, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి, అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు నెలకొల్పిన నాయకులు, సిపిఎం పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని, భారత దేశంలో దోపిడి రహిత సమ సమాజం కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. లౌకికతత్వాన్ని, రాజ్యాంగాన్ని, ఫెడరలిజన్ని కాపాడడానికి జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని, చివరి శ్వాస వరకు శ్రామిక ప్రజల విముక్తి కోసం పోరాడారని అన్నారు. వారి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి. శ్రామిక ప్రజలకు, కార్మిక వర్గ పోరాటాలకు తీరనిలోటని అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, నవ తెలంగాణ రిపోర్టర్స్ శోభన్ బాబు, బిక్షపతి, ఉపాధ్యక్షులు మండే శ్రీనివాస్, సింగరేణి ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, ఎస్కే గౌస్, ఏ శంకరన్న, తిప్పారపు రాజు, ఈద వెంకటేశ్వర్లు, ఈదుల సాగర్, జంగపల్లి మల్లేష్, జీబ్ స్టాండ్ ఆటో స్టాండ్ ఓనర్స్ డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App