Foundation laying of several development works in Peddapalli Constituency through Amrit 2.O scheme and TUFIDC schemes
పెద్దపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరియు పలు మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలి..
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు,ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మరియు పలువురు ప్రజా ప్రతినిధులు పెద్దపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి శనివారం రోజున వస్తున్న సందర్భంగా స్థల ఏర్పాట్లను అధికారులతో మరియు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ…
తేదీ: 14-09-24, శనివారం రోజున జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో 132/33 కె.వి సబ్ స్టేషన్ కు శంకుస్థాపన మరియు పెద్దపల్లి పట్టణంలో వ్యవసాయ మార్కెట్లో విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన అలాగే పెద్దపల్లి ఎస్టి కాలనీలో భూమి పూజ అనంతరం పెద్దపల్లి మండలం రాఘవపూర్, రంగాపూర్ గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన మరియు పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయం ఆవరణలో పలు అభివృద్ధి పనులకు మరియు అమృత్ 2.0 కింద త్రాగు నీటి పధకం మరియు TUFIDC కింద పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జిల్లా మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు పలువురు మంత్రులు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందని అన్నారు..
అనంతరం పెద్దపల్లి జెండా చౌరస్తా దగ్గర జరిగే పబ్లిక్ మీటింగ్ లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అలాగే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.
రానున్న రోజుల్లో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి బైపాస్ రోడ్డు, బస్సు డిపో ఏర్పాటు చేస్తామన్నారు.
మంత్రుల పర్యటన సందర్భంగా పెద్దపల్లి పట్టణంతో పాటు, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, మహిళలు, ప్రజలు, పెద్ద ఎత్తున పాల్గొని మంత్రుల పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరారు..
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి, విద్యుత్ అధికారులు, పోలీస్ అధికారులు, పలు శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App