Distribution of electronic autos to Dwakra women
Trinethram News : హైదరాబాద్ : సెప్టెంబర్ 12
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సరికొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజల మన్ననలను పొందుతున్నారు.
అందులో మరీ ముఖ్యంగా మహిళల కోసం ఎన్నో పథ కాలను ప్రవేశపెడుతున్నా రు. ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నా రు. డ్వాక్రా మహిళలకు సంబంధించి తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం కొలు వుదీరిన రెండు రోజులకే 6 గ్యారెంటీల్లో రెండు గ్యారం టీలను అమలు చేసింది కాంగ్రెస్. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసిన తర్వాత ఒక్కొక్క గ్యారెంటీని ప్రారంభించుకుంటూ వస్తోంది.
తాజాగా ప్రభుత్వం డ్వాక్రా పొదుపు సంఘాల మహిళ లకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపి ణీ చేయాలనీ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా సమా చారం వస్తోంది. ఈ మేరకు నిన్న జనగామ జిల్లా పాలకుర్తిలో ఓ మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోను పంపిణీ చేశారు.
దీంతో ఆ మహిళ సంతోషం వ్యక్తం చేసింది. డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు లేదా ఆమె కుటుంబంలో లైసెన్స్ ఉన్న వ్యక్తికి ఈ ఎలక్ట్రిక్ ఆటోను ఇవ్వను న్నారు. అయితే ప్రభుత్వం స్త్రీ నిధి లోన్ నుంచి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ను కొను గోలు చేసి ఇవ్వున్నారు.
అయితే మహిళలు ఇలా తీసుకున్న ఈ రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆటోలకు ఛార్జింగ్ పాయింట్ల కోసం ప్రభుత్వ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App