SBI ఉద్యోగుల ఔదార్యం.. వరద బాధితుల కోసం రూ.5కోట్లు విరాళం

TRINETHRAM NEWS

Generosity of SBI employees.. Donation of Rs.5 crores for flood victims

Trinethram News : వరద బాధితులను ఆదుకోవడంలో ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) ఉద్యోగులు తమ ఉదారతను చాటుకున్నారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా ‘తెలంగాణ ఎస్‌బీఐ ఉద్యోగులు’ తమ ఒక రోజు వేతనం రూ.5 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళమిచ్చారు.

జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గార్లను ఎస్‌బీఐ ప్రతినిధి బృందం కలిసి, రూ.5 కోట్ల విరాళం చెక్కును అందజేశారు.

సీఎం, డిప్యూటీ సీఎంను కలిసినవారిలో ఎస్‌బీఐ సీజీఎం రాజేష్ కుమార్, డీజీఎం జితేందర్ శర్మ, ఏజీఎంలు దుర్గా ప్రసాద్, తనుజ్ తదితరులు ఉన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ఎస్‌బీఐ ఉద్యోగులు చూపిన ఔదార్యాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top