WhatsApp Image 2024 08 20 at 3.09.45 PM
Konda Vishweshwar Reddy, Member of Parliament from Chevella who visited Raghavendra Mudiraj
కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడిన పూడూరు మండలం భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్ ముదిరాజ్ ని పరామర్శించిన చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి..
ఆగస్టు 16న తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కడ్మూర్ ఆనందం, అతని అనుచరులు కలిసి ప్రభుత్వ భూముల కబ్జాలకు అడ్డుపడుతున్నడు అనే ఆలోచనతో రాఘవేందర్ ముదిరాజ్ పై తన రివాల్వర్ తో బెదిరించి దాడికి పాల్పడడం జరిగింది. ఈ విషయము తెలిసిన వెంటనే కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది.
ఈరోజు రాఘవేందర్ ముదిరాజ్ ని పరామర్శించిన అనంతరం జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ని కలిసి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోకపోతే ఉపేక్షించేది లేదని చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానంద రెడ్డి, ఉప్పరి రమేష్, మిట్ట పరమేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
