Pay the workers of the sanitation department who worked in the Parliament elections
రామగుండం నగర పాలక సంస్థ లో పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ను సస్పెండ్ చేయాలి.
అతను చేస్తున్న అవినీతి పై సమగ్ర విచారణ జరపాలి.
పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసిన పారిశుద్ధ్య విభాగానికి చెందిన కార్మికులకు వేతనాలు ఇప్పించండి .
పారిశుద్ధ్య విభాగం కార్మికులకు సంబంధించిన సొసైటీ గ్రూప్ నిధుల గురించి విచారణ చేపట్టాలి.
జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ కి వినతి పత్రం ఇచ్చిన ప్రజా సంఘాల నాయకులు.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని పారిశుద్ధ్య కార్మికులను వేధింపులకు గురి చేయడం తో పాటు విజయ్ అనే పారిశుద్ధ్య కార్మికుడి ఆత్మహత్యకు చేసుకోవడానికి కారకుడైన హెల్త్ అసిస్టెంట్ కిరణ్ ను సస్పెండ్ చేయాలని ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ.గౌస్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినెష్ లు జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ నికోరారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సమస్యలతో కూడిన వినతి పత్రం ఇచ్చిన అనంతరం వారు మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలోని పారిశుద్ధ్య విభాగం మొదటి నుండి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రామగుండం నగరపాలక సంస్థ పేరును పరువు ప్రతిష్టను మంటగల్పుతున్నారని వారు ఆరోపించారు .
స్వాతంత్ర్య దినోత్సవం రోజున పారిశుద్ధ్య విభాగం కు చెందిన ఒక కార్మికుడు విజయ్ పారిశుద్ధ్య విభాగం లో హెల్త్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కిరణ్ భయంకరమైనటువంటి వేధింపులు భరించలేక రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం లోనే మేయర్, కమిషనర్, ఇతర ప్రజాప్రతినిధులు జెండా ఆవిష్కరించిన కొద్ది క్షణాల్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడం నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామమని వారు పేర్కొన్నారు. అవినీతిపరుడైనటువంటి హెల్త్ అసిస్టెంట్ కిరణ్ పై అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ ముఖ్యంగా పెట్రోల్,డీజిల్ కుంభకోణానికి పాల్పడుతున్నారని, కొంతమంది అధికార పార్టీ నేతల అండదండలతో నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనే నియంతలా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు.
గతములో కూడ ఇతని పై ఫిర్యాదు చేయడం జరిగిందని వారు గుర్తు చేయడం చేశారు. అదేవిధంగా పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను టార్గెట్ గా చేస్తూ తనకు నచ్చిన వారికి ఒక రకమైన పనులు, తనకు గిట్టని వారిని ఇంకో రకమైనటువంటి పనులను చేయిస్తూ ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపిస్తున్నాడని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. కనుక ఆయన చేసే అవినీతి ఆరోపణలు, కార్మికుల వేధింపులపైన, సమగ్ర విచారణ చేసి ఆయనను సస్పెండ్ చేయాలని వారు కోరారు. అదే విధంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రామగుండం నగరపాలక సంస్థ లోని పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న వంద మందికి పైగా పార్లమెంటు ఎన్నికలలో పనిచేసిన వారికి వేతనాలు అందలేదని కనుక వారికి వేతనాలు ఇప్పించగలరని వారు కోరారు.
అదేవిధంగా 2020వ సంవత్సరంలో పారిశుధ్య విభాగం కు సంబంధించిన కార్మికుల భద్రత కొరకు మరియు వారి అవసరాల కొరకు సొసైటీ గ్రూప్ గా అప్పుడున్న నగర కమిషనర్ ఐఏఎస్ ఏర్పాటు చేయించడం జరిగింది. దానిలో భాగంగా ఇప్పటివరకు అట్టి నిధులు ఎక్కడున్నాయి? ఎవరి దగ్గర ఉన్నాయి? వాటిలో ఖర్చు ఎంత ఐనాయి, ఎంత ఉన్నాయి, వాటిని చూసుకునేది ఎవరు? అనే విషయాల పై సమగ్ర విచారణ చేసి కార్మికులకు అన్ని రకాలుగా న్యాయం చేసే విధంగా చూడాలని వారు కోరారు.
అనంతరం గౌరవ అదనపు కలెక్టర్ అరుణశ్రీ గారు సానుకూలంగ స్పందించారు. సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకుంటమాని హామీ ఇచ్చారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App