District Excise Officer R. Mahipal Reddy said protective shield should be used to prevent accidents
పెద్దపల్లి, ఆగస్టు-14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలోని కల్లుగీత కార్మికులు ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షణ కవచాన్ని వినియోగించాలని జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.మహిపాల్ రెడ్డి అన్నారు.
బుధవారం జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.మహిపాల్ రెడ్డి పెద్దపెల్లి మండలంలోని పెద్ద కాలువల గ్రామంలో గీత కార్మికులకు , గౌడ కులస్తులకు కాటమయ్య రక్షణ కవచం వినియోగం పై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి జి.అనిల్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్.మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాక్ మౌంటెన్ నిష్ణాతులైన శిక్షకుల ద్వారా కలుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని , దీని వినియోగం విధానం మెలుకువులను నేర్పించడం జరుగుతుందని అన్నారు.
గీత కార్మికులకు ఎలాంటి ప్రమాదాలు బారిన పడకుండా వారి వృత్తిని కొనసాగించేందుకు అవగాహన కల్పిస్తున్నామని, కాటమయ్య రక్షణ కవచం సురక్షిత పరికరం అని, దీని వల్ల చెట్టు ఎక్కే వారికి ప్రమాదం తగ్గుతుందని, సురక్షితమైన పని వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. ఈ రోజు మొత్తం 35 మంది గీత కార్మికులకు శిక్షణ అందించామని, ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపించిన గీత కార్మికులకు అధికారులకు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎక్సైజ్ సీఐ ఎం. శిరీష, ఎస్ఐ లు జీవన్ రెడ్డి, పావని కానిస్టేబుల్ లు సంతోష్ కృష్ణ, వనిత ,దిలీప్ పెద్దపల్లి గౌడ సంఘం అధ్యక్షులు కొమురయ్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App