TRINETHRAM NEWS

The anti-Dalit budget introduced by the central government is a partial allocation of funds

16.2 శాతం కేటాయించాల్సి ఉండగా 11 శాతం మించలేదు
ప్రయివేట్‌ రంగంలోనూ రిజర్వేషన్ల కల్పనకు బిల్లు ప్రవేశపెట్టాలి

షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ ప్లాన్‌ని జాతీయ స్థాయిలో అమలు చేయాలి

ఖనిలో దళిత హక్కుల పోరాట సమితి నాయకుల నిరసన

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కేంద్ర బడ్జెట్‌ దళిత వ్యతిరేక బడ్జెట్‌ అని, దీనికి వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా నిరసనలలో భాగంగా పెద్దపల్లి జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం రోజున ఖని లోని మున్సిపల్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాల వేసి అనంతరం నిరసన తెలిపారు.

అనంతరం డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి కందుకూరి రాజారత్నం మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్ మాట్లాడుతూ దళిత సమాజాన్ని ఈ బడ్జెట్‌ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్జెట్‌ కేటాయింపులు, వ్యయాలను పెంచాలని, షెడ్యూల్డ్‌ కులాల సబ్‌ప్లాన్‌ (ఎస్‌సీఎస్‌పీ)ని జాతీయ స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రయివేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని దళితులు ప్రధానంగా వ్యవసాయ కార్మికులకు గానూ, అసంఘటిత రంగాల్లోనూ ఉపాధి పొందుతున్నారన్నారు.

సామాజిక అభివృద్ధికి, దళిత సంక్షేమానికి కేంద్రం ప్రతి యేటా తగిన బడ్జెట్‌ కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కానీ దశాబ్ద కాలంగా బీజేపీ హయాంలో షెడ్యూల్డ్‌ కులాల బడ్జెట్‌ ఖర్చులు తగ్గుముఖం పట్టాయన్నారు. దళిత జనాభా నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు లేకపోగా, సవరించిన బడ్జెట్‌ల ప్రకారం కేటాయించిన నిధులు సైతం తగ్గుముఖం పడుతున్నాయని విమర్శించారు. నిటీ ఆయోగ్‌ సిఫారసులు, దళిత జనాభా ప్రకారం షెడ్యూల్డ్‌ కులాలకు రావాల్సిన కేటాయింపులు 16.2 ఉండాలని, కానీ గడిచిన పదేండ్ల బడ్జెట్‌ అంచనాల్లో బడ్జెట్‌లో 11 శాతం దాటలేదని పేర్కొన్నారు.
ఎస్సీలకు కేటాయించిన మొత్తం రూ.1,65,493 కోట్లు కాగా, ఇందులో 3.2 శాతం (రూ.46,195 కోట్లు) మాత్రమే నేరుగా ఎస్సీలకు చేరుతోందన్నారు. కేంద్ర బడ్జెట్‌ 2024-25లో సామాజిక న్యాయం, సాధికారత శాఖ కోసం నివేదించిన మొత్తం కేటాయింపులు రూ. 13,000 కోట్లని, ఇది 2023-24 తో పోలిస్తే రూ.163 కోట్లు పెరిగిందన్నారు. ఈ కేటాయింపులు 2023-24లో సవరించిన అంచనాల్లో రూ.9,853.32 తగ్గించారన్నారు. షెడ్యూల్డ్‌ కులాల కోసం పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు మొత్తం బడ్జెట్‌లో గణనీయమైన వాటా కేటాయింపు 49 శాతం పొందినప్పటికీ గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదన్నారు 2023-24 లో రూ.6,359 కోట్లు కేటాయించగా, అదే ఏడాది సవరించిన అంచనాల్లో రూ.5,400 కోట్ల కేటాయింపు తగ్గిందని తెలిపారు.

షెడ్యూల్డ్‌ కులాలను సామాజిక అభివృద్ధిలోకి తీసుకురావడానికి బడ్జెట్‌లో కేటాయింపులను సవరించాలని, ప్రభుత్వ రంగ ప్రయివేటీకరణను ఆపాలని, బ్యాక్‌లాగ్‌ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని దళితులకు ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్ల బిల్లును ఈ పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని,
షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధికి నిధుల కేటాయింపు, వినియోగాన్ని నిర్ధారించడానికి జాతీయ స్థాయిలో సబ్‌ ప్లాన్‌ చట్టాన్ని అమలు చేయాలన్నారు.
అదే విధంగా విద్య, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో షెడ్యూల్డ్‌ కులాల వారి భాగస్వామ్యం, సాధికారతను మెరుగుపరచడానికి తగిన వనరులను అందించాలన్నారు.
పదోన్నతుల్లో రిజర్వేషన్ల రాజ్యాంగ రక్షణను అనుసరించాలని దళితులపై అఘాయిత్యాలు జరగకుండా నిరోధించడానికి ఎస్సీ, ఎస్టీ లైంగికదాడి నిరోధక చట్టాన్ని స్ఫూర్తిగా అమలు చేయాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో దళిత కుల పోరాట సమితి నాయకులు జనగామ జగదీష్ దుర్గం రాజేశ్వరరావు గంగారపు ప్రసాద్ మరియు కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు ఏం.ఏ. గౌస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The anti-Dalit budget introduced by the central government is a partial allocation of funds