WhatsApp Image 2024 08 03 at 17.22.45
Municipal Commissioner inspecting the muddy roads of Rajya Lakshmi Colony
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం కార్పొరేషన్ పరిధి 5వ డివిజన్, సింగరేణి మెడికల్ కాలేజ్ సమీపంలోని రాజలక్ష్మి కాలనీలో శనివారం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ పర్యటించారు.
గత కొన్ని రోజులుగా కాలనీలో అభివృద్ధి పనులు చేపట్టాలని రోడ్లు డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, ప్రస్తుత వర్షాకాలంలో రోడ్లన్నీ బురదమయమయ్యాయని కాలనీ ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు కార్పొరేటర్ కల్చర్ల కృష్ణవేణి, కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ మేరకు కమిషనర్ బురదయమైన రోడ్లను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకొని పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వచర్ల కృష్ణవేణి, అభివృద్ధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఊరగొండ రమేష్, దబ్బెట శంకర్, సభ్యులు శ్రీనివాస్ రాజయ్య కె.పి రాజ్ కుమార్, సుకూర్, గట్టు శ్రీనివాస్, చంద్రమౌళి మహిళలు మాధవి, రమ, స్వప్న, రజిత తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
