Special focus on missing and unnatural death cases and special action on dial 100s: Manchiryala DCP A. Bhaskar
మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంచిర్యాల డిసిపి కార్యాలయంలో ఏసిపి, సిఐ, మరియు యస్ఐ లతో జరిగిన నేర సమీక్ష సమావేశము నిర్వహించడం జరిగింది.
ఈ సందర్బంగా డిసిపి మాట్లాడుతూ అసహజ మరణాలు, మిస్సింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలని మరియు డయల్ 100 కాల్స్ పట్ల సత్వర స్పందన కలిగి ఉండాలని సూచించడం జరిగింది. ఎవరైనా తప్పి పోయినట్లు ఫిర్యాదు అందినచో ఆలస్యం చేయకుండా కేసు నమోదు చేసి తప్పి పోయిన వ్యక్తి యొక్క వివరాలతో కూడిన ఫోటో అన్ని పోలీస్ స్టేషన్ల కు పంపించి సంబంధిత వెబ్ సైట్ లో పొందు పరచాలని ఆదేశించారు. అదే విధంగా అసహజ మరణాలు దర్యాప్తు చేయునపుడు మృతుని మరణానికి గల కారణాలను లోతుగా పరిశోధించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తగు విధంగా పరిష్కరించాలని సూచించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App