TRINETHRAM NEWS

Chairman of Adil Group and former MPTC of Manneguda, Syed Adil Ahmed, has received an honorary doctorate in the field of social service.

Trinethram News : పరిగి: గ్లోబల్ హ్యూమన్ పీస్ ఇంటర్నేషనల్ వర్చువల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పీపుల్ ఫోరం ఆఫ్ ఇండియా భారత్ సేవక్ సమాజ్ వారు ఢిల్లీలోని శ్రీ సత్య సాయి ఆడిటోరియంలో నిర్వహించిన వివిధ రంగాలతో పాటు సామాజిక సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న ప్రముఖులకు గౌరవ డాక్టరేట్ ప్రదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం ఆదిల్ గ్రూప్స్ చైర్మన్ మరియు మన్నెగూడ మాజీ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ అహ్మద్ సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఆదిల్ గ్రూప్స్ చైర్మన్ మరియు మన్నెగూడ మాజీ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ అహ్మద్ సేవలను గుర్తించి గ్లోబల్ హ్యూమన్ పీస్ సంస్థ ప్రశంసించి వారి సేవలను గుర్తిస్తూ సామాజిక సేవ రంగంలో గౌరవ డాక్టరేట్ పట్టను గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ వ్యవస్థాపకులు డాక్టర్ మానుఏల్, వరల్డ్ పీస్ ఇనిస్టిట్యూట్ యునైటెడ్ నేషన్ ఫౌండర్ డాక్టర్ పర్వీందర్ సింగ్ మరియు తమిళనాడు స్పెషల్ కమిషనర్, రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఐఏఎస్ సంపత్ కుమార్ చేతుల మీదుగా గౌరవ డాక్టరేట్ తో పాటు జాతీయ ఏపీజే అబ్దుల్ కలాం అవార్డును అందుకున్నారు.

ఈ సందర్భంగా ఆదిల్ గ్రూప్స్ చైర్మన్ మరియు మన్నెగూడ మాజీ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ అహ్మద్ మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేట్ పట్టాతో తన బాధ్యత మరింత పెరిగిందని నేను చేస్తున్న సేవలను గుర్తించిన గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్శిటీ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతూ ఈ ఉత్సాహంతో తమ సేవాకార్యక్రమాలను మరింత ముందుకు తీసుకుని వెళ్తానని అదే విధంగా జిల్లా ప్రజలకు సేవలందించేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు.

ఆదిల్ గ్రూప్స్ చైర్మన్ మరియు మన్నెగూడ మాజీ ఎంపీటీసీ సయ్యద్ ఆదిల్ అహ్మద్ కి గౌరవ డాక్టరేట్ రావడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా సామాజిక సేవకు దక్కిన ఉన్నత గౌరవం అని డాక్టర్ సయ్యద్ ఆదిల్ అభిమానులు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chairman of Adil Group and former MPTC of Manneguda, Syed Adil Ahmed, has received an honorary doctorate in the field of social service.