TRINETHRAM NEWS

The largest cargo ship has arrived

Trinethram News : విశాఖపట్నం : విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది.

ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది.

ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు.

ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి 1,99,900 టన్నుల మాంగనీస్ తో చేరుకోగా విశాఖ పోర్టులో 1,24,500 టన్నులు అన్లోడ్ చేశారు.

బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక, సరకు నిర్వహణ ఏజెంట్ గా సేవలందిస్తోంది.

ఈ షిప్మెంట్ విశాఖ పోర్టు, బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పోర్టు ఛైర్మన్ ఎం.అంగముత్తు అభివర్ణించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The largest cargo ship has arrived.