Counseling for those involved in cases of transportation and sale of ganja in Manchiryala district
తమ నేర ప్రవృత్తిని మార్చుకోక పోతే ఎంతటి వారైనా ఉపేక్షించే లేదు.. పీడీ యాక్ట్ తప్పదు డీసీపీ ఎ. భాస్కర్
మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
యం.శ్రీనివాస్, ఐ.పి.యస్.,(ఐ.జి.పి.) కమిషనర్ ఆప్ పోలీస్, రామగుండం ఆదేశాల ప్రకారము ఎగ్గడి భాస్కర్ డి.సి.పి., మంచిర్యాల మంచిర్యాల జిల్లా లో గత మూడు సంవత్సరాల నుండి గంజాయి అక్రమ రవాణా మరియు అమ్మకం చేసినటువంటి వ్యక్తులను ఈ రోజు మంచిర్యాల డి.సి.పి., కార్యాలయము కి పిలిపించి వారి కుటుంబ సభ్యుల సమక్షములో కౌన్సిలింగ్ నిర్వహించి ఇక ముందు ఇలాంటి నేరాలు చేయకూడదని హెచ్చరించడం జరిగినది. మరియు ఇట్టి వ్యక్తులపై హిస్టరీ షీట్ నమోదు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వము తీసుకుంటున్న చర్యలలో భాగంగా, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు, గంజాయి కేసులలో ఉన్నటువంటి నేరస్తులపై నిరంతర నిఘా ఉంచి, మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘాతో పాటు గతంలో ఎన్‌డీపీఎస్ కేసుల్లో ఉన్న నేరస్థుల కదలికలను గమనిస్తూ ప్రత్యేక బృందం ఎప్పుడు ఉంటుందన్నారు.
ఒకవేళ ఎవరైనా తిరిగి తమ నేర ప్రవృత్తిని మార్చుకోక మరల ఇలాంటి నేరాలు చేసినచో వారి పై PIT NDPS పి.డి.యాక్టు కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుంది. సాధారణ పి.డి.యాక్టు లో ఒక సంవత్సరం జైలు శిక్ష ఉంటుంది, కానీ PIT NDPS పి.డి.యాక్టు లో రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. మంచిర్యాల జోన్ పరిధిలో గంజాయి రవాణా, అమ్మకాలు వినియోగం జరుగకుండా చూడాలని అధికారులను డీసీపీ ఆదేశించడం జరిగినది.
ఇట్టి కార్యక్రమము లో మంచిర్యాల, బెల్లపల్లి ఎసిపి లు ఆర్. ప్రకాష్, శ్రీ ఎ. రవికుమార్ మరియు సీఐలు యస్.ఐ.లు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App