TRINETHRAM NEWS

District Collector Koya Harsha made extensive arrangements for the visit of the ministers

*మంత్రుల పర్యటన నేపథ్యంలో రామగుండం పోలీస్ కమీషనర్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్

ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, జూలై-18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జూలై 19న జిల్లాలోని ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో జరుగనున్న మంత్రుల పర్యటనకు విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష ఓదెల మండలంలోని కొలనూరు, కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాతుపల్లి, కాల్వ శ్రీరాంపూర్ గ్రామాలలో మంత్రుల పర్యటన సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో రామగుండం పోలీస్ కమీషనర్. శ్రీనివాస్, డీసీపీ ఎం.చేతనతో కలిసి పరిశీలించారు.

ఓదెల కొలనూరు రోడ్డు మార్గం, ఓదెలలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెద్దరాతుపల్లి గ్రామంలోని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రదేశం, రెడ్డి గార్డెన్స్ ను కలెక్టర్ పరిశీలించారు.

పెద్దపెల్లి జిల్లాలో జూలై 19న శుక్రవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ళ శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రెవెన్యూ శాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లతో కూడిన మంత్రుల బృందం పర్యటించనున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పరిశీలించారు.

ఉదయం హెలికాప్టర్ ద్వారా మంత్రుల బృందం పెద్దపల్లి లోని ఓదెల మండలం కొల నూరు గ్రామానికి చేరుకుంటారని, ఓదెల కొలనూరు మధ్య నిర్మించిన రోడ్డును, కొలనురు గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రుల బృందం ప్రారంభిస్తుందని తెలిపారు.

అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని పెద్దరాతుపల్లి గ్రామంలో నిర్మించతల పెట్టిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులకు మంత్రుల బృందం శంకుస్థాపన చేస్తుందని, రెడ్డి గార్డెన్స్ లో ఆయిల్ పామ్ రైతులతో మంత్రుల బృందం భేటి జరుగుతుందని అన్నారు. అనంతరం మంత్రుల బృందం రైతు భరోసా సమావేశానికి హాజరయ్యేందు కు కరీంనగర్ బయలుదేరి వెళతారని పేర్కొన్నారు. జిల్లాలో మంత్రుల బృందం పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Harsha made extensive arrangements for the visit of the ministers