MLA Yashaswini Jhanni Reddy is the aim of our government to develop the poor
పాలకుర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యం అని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి అన్నారు..
శనివారం తొర్రురు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్ని రెడ్డి లబ్బిదారులకు అందచేసారు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన 185 మంది బాధితులకు మంజురైన 49 లక్షల నాలుగు వేల రూపాయలు (49,04,000) రూ. చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి లబ్బిదారులకు అందచేసారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతు ఆరోగ్య పథకం ద్వారానే కాకుండా ఆరోగ్య పథకం వర్తించని వ్యాధులకు, పేదలను ఆదుకోవడం కోసం సిఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్ని రెడ్డి అన్నారు..
ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి పిలుపునిచ్చారు..
దేశంలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రములో ప్రజాకర్షక పథకాలను రూపకల్పన చేసిన సిఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి అన్నారు
సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సిఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు ఆమ్యా నాయక్, రాపాక సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సోమా రాజశేఖర్, మండల అధ్యక్షులు సుంచు సంతోష్, రవీందర్ రెడ్డి, సురేష్ నాయక్, గిరగాని కుమారస్వామి, ముద్దసాని సురేష్, నల్ల శ్రీరామ్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు, తదితరులు, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App