Women offered special puja to Gangamma’s mother
గంగమ్మ తల్లికి ఘనంగా గంగపుత్రుల బోనాలు.
పట్టుబట్టలతో గంగమ్మ తల్లికి నదిలో వైనాలు.
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు సమర్పించిన మహిళలు..
మహిళలు బోనాలతోమంగళ హారతులు శోభయాత్ర.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఆషాడ మాస పర్వదినాన్ని పురస్కరించుకొని గంగపుత్రుల బెస్తవారి ఇలవేల్పు గంగమ్మ తల్లికి గోదావరి నది ఒడ్డున మహిళలు బోనాలతో మంగళ హారతులతో ఘనంగా పూజలు అందించారు తొలుత గోదావరిఖనిలోని పోచమ్మ తల్లికి మొక్కులు సమర్పించుకొని ఆ తరువాత సమ్మక్క సారలమ్మ తల్లి గద్దెలల పూజలు సమర్పించుకొని అందరూ బోనాల నెత్తిన ఎత్తుకొని గోదావరి నది ఒడ్డున ఉన్న గంగమ్మ తల్లి దేవాలయాలకు తరలివచ్చారు.
అనంతరం వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛాల మధ్య గంగమ్మ తల్లి పూజలు చేసి బోనాల సమర్పించుకొని వాయునాలను తీసుకున్నారు ఆ తరువాత గోదావరి నదిలోకి గంగమ్మ తల్లి పట్టుచీరలతో సాంప్రదాయ పద్ధతిలో మహిళలందరూ వెళ్లి పూజలు చేసి నదిలో హారతులను వెలిగించి చీరలను నదిలోకి వదిలి పాటలతో గంగమ్మ తల్లికి మొక్కులు సమర్పించారు.
ఆ తరువాత ఆషాడమాసం సందర్భంగా మహిళలందరూ గంగమ్మ తల్లి ఆలయంలో కూర్చుని కన్నుల విందుగా గోరింటాకు పెట్టుకొని సంతోషంగా సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గంగపుత్ర సొసైటీ మహిళలు తాడబోయిన శ్యామల ఏరువా సునీత లక్ష్మి, ఉమా సరోజ, లక్ష్మి ,సరోజ ,లక్ష్మి, కొమురక్క ,భారత లక్ష్మి, ఈశ్వరమ్మ ,అంజమ్మ, తో పాటుగా నాయకులు పారిపల్లి రాజలింగం నారాయణ ఈశ్వరయ్య వసంత్ కుమార్ రమేషు చంద్రమోహన్ మురళి రమేష్ కొమురయ్య వెంకటేష్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App