TRINETHRAM NEWS

Huge fire accident in Bhudan Pochampally factory

Trinethram News : యాదాద్రి జిల్లా : జులై 11
యాదాద్రి భువనగిరి జిల్లా లో గురువారం తెల్లవారు జామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. భూదా న్ పోచంపల్లి మండల పరిధి లోని దోతిగూడెం గ్రామంలో ని విత్తనాలు ఉత్పత్తి చేసే కంపెనీలో షాట్ సర్క్యూ ట్‌తో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.

అయితే, ఆ మంటలు కాస్త ఫ్యాక్టరీలో వ్యాపించడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గమనించిన కంపెనీ సిబ్బంది ఫైర్ సిబ్బందికి సమాచార అందజేయగా వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రమాద సమయంలో ఎవ రు కంపెనీలో లేకపోవడం తో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రూ.లక్షల్లో ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చిన కంపెనీ సిబ్బంది తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge fire accident in Bhudan Pochampally factory