We can overcome the difficulties faced in life only when we move forward with courage
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, కేశొరాం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కౌశిక హరి,బిజేపి నేతలు ఎస్.కుమార్, ఉన్నారు
జ్యోతిగాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరిఖని తిలక్ నగర్ డౌన్ లోని శ్రీ గణేష్ ఫంక్షన్ హాల్ లో జీవితంలో విజేత అయిన మహిళామణికి జ్యోతిగాంధీ స్మారక పురష్కార్ కార్యక్రమం నిర్వహించారు.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు దయానంద్ గాంధీ ముఖ్యఆతిథుల చేతుల మీదుగా చిన్నతనంలోనే యాసిడ్ దాడిని ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో జీవితంలో స్థిరపడిన మహిళ సుజాతకు జ్యోతిగాంధీ స్మారక పురస్కార్ ను అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ, మంత్రి, మాజీ ఎమ్మెల్యే తోపాటు కౌశిక హరి మాట్లాడుతూ మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి బయపడొద్దని, దైర్యంగా నిలబడి ఎదురించాలన్నారు
చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న తరుణంలో దుర్మార్గులు జరిపిన యాసిడ్ దాడిని ఎదుర్కొని జీవితంలో విజేతగా నిలిచిన సుజాతను మహిళలందరూ ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.
చాలా అవార్డు కార్యక్రమాలు చూస్తాము కానీ సమాజాన్ని మంచి మార్గంలో నడిపించే వారికి, సమాజానికి స్ఫూర్తిగా నిలిచే అవార్డు అందించడం మంచి పరిణామన్నారు. 1996 కాలంలో జరిగిన సంఘటనలో చాలా ఇబ్బందులను ఎదుర్కొని ఆర్థిక ఇబ్బందులను అదికమించి దయానంద్ గాంధీ, కె. స్వామి, ఎస్. కుమార్ లాంటి మనసున్న వ్యక్తుల కారణంగా జీవితంలో నిలబడ్డ సుజాత, అందుకు సహకరించినవారు అభినందనీయులు అని అన్నారు.
జ్యోతిగాంధీ పురస్కార్ గ్రహీత సుజాత మాట్లాడుతూ తనపై జరిగిన యాసిడ్ దాడిని ధైర్యంగా ఎదుర్కొనేలా తనకు బాసట నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలిపారు తనపై జరిగిన యాసిడ్ దాడి కారణంగా జీవితంలో ఎంతో ఇబ్బందులను.ఎదుర్కొన్నానని తెలిపారు. ప్రతి మహిళా తాను జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలువాలనీ ఈ అవార్డును తీసుకోవడానికి అంగీకరించిందన్నారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మివాణి, పెద్దెల్లి ప్రకాష్, గాలి సునీత, దామెర శంకర్,కంది రవీందర్ రెడ్డి, PS అమరేందర్, పందిళ్ళ శ్యామ్ సుందర్, అందె సదానందం, ముద్దసాని సంద్యారెడ్డి మేజిక్ రాజా, సంతోష, సంక్షేమ, విజయ, చంద్ర కళ, మానస, లక్ష్మన్ జాకబ్, అబంటి నరేష్, అరవింద్, నారాయణ,
తదితరులు ఉన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App