District Collector Koya Harsha said that rice should be supplied to the ration shops quickly
పెద్దపల్లి, జూలై-6: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి ఎం.ఎల్.ఎస్. పాయింట్ పరిధిలో పెండింగ్ ఉన్న రేషన్ షాపులకు బియ్యాన్ని త్వరగా సరఫరా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
శనివారం బస్టాండ్ సమీపంలో ఉన్న పెద్దపల్లి ఎం.ఎల్.ఎస్. పాయింట్ ను జిల్లా కలెక్టర్ కోయ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఎం.ఎల్.ఎస్. పాయింట్ వద్ద కలెక్టర్ స్టాక్ రిజిస్టర్, ఇష్యూ రిజిస్టర్, గూడ్స్ రిజిస్టర్ రికార్డులను, ఆన్ లైన్ రికార్డులను, వెయింగ్ యంత్రాల రిసిప్ట్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా చేసే విధానాన్ని కలెక్టర్ ఆరా తీశారు.
పెద్దపల్లి ఎం.ఎల్.ఎస్ పాయింట్ పరిధిలో పెద్దపల్లి, రామగుండం, ధర్మారం, పాలకుర్తి, అంతర్గం మండలాల్లోని 195 రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా, జూలై మాసానికి సంబంధించి ఇప్పటి వరకు 170 షాపులకు సరఫరా పూర్తి చేశామని అధికారులు తెలిపారు. స్టేజ్ 2 తుది కాంట్రాక్టర్ ఫైనలైన నేపథ్యంలో పెండింగ్ ఉన్న షాపులకు సైతం త్వరగా బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ తనీఖీ సమయంలో ఎం.ఎల్.ఎస్. పాయింట్ వద్ద జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్, నాయబ్ తహసిల్దార్ బి.రాం బాబు, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App