Telangana DSC exam schedule has been released
పకడ్బందీ గా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు
హైదరాబాద్:జులై 06
తెలంగాణలో డీఎస్సీ పరీక్ష ల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవీ నర్సింహా రెడ్డి తెలిపారు.
ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పరీక్షలను తొలిసా రిగా ఆన్ లైన్లో నిర్వహిస్తు న్నట్లు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఆప్పీళ్లను స్వీకరిస్తున్నా మని కమిషనర్ ఈవీ నర్సింహా రెడ్డి తెలిపారు.
శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులచే వర్చువల్ గా సమావేశాన్ని నిర్వహించి పలు కీలక ఆదేశాలు ఇచ్చారు.
డీఎస్సీ ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ ను ఉదయం 10.30లోపు నమోదు చేయాలని..దీనినే మధ్యా హ్న భోజనానికి పరిగణలో నికి తీసుకుంటామని తెలిపారు. బడిబాట ఎన్ రూల్ మెంట్ ను ఐఎస్ఎం ఎస్ పోర్టల్లో అప్ డేట్ చేయాలన్నారు.
రెండో జత యూనిఫాంలను వెంటనే కుట్టించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలను రోజూ ఆన్ లైన్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
కాగా తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను తొలిసారిగా ఆన్ లైన్లో నిర్వహించనున్నారు.
సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జులై 18న మొదటి షిష్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్టులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు.
జులై 19 నుంచి 22 వరకు పలు మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ పరీక్షలకు 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App