TRINETHRAM NEWS

TBKS protested by wearing black badges on all mines in Rg1 area

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

సింగరేణి సంస్థను కాపాడుకుందాం బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా పోరాడుదాం అంటూ టీబీజీకేఎస్ ఇచ్చిన పిలుపుమేరకు సోమవారం
టీబీజీకేఎస్ ఆర్జీ1 ఉపాధ్యక్షుడు వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో
రామగుండం డివిజన్ 1 లో కార్మిక లోకం నల్ల బ్యాడ్జీల ధరించి తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. రామగుండం డివిజన్ 1 జీఎం కార్యాలయంలో మినిస్టీరియల్ స్టాప్ ఉద్యోగులను ఉద్దేశించి టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి మాట్లాడుతూ, కాంగ్రెస్ బిజెపి ప్రభుత్వాలు సింగరేణి సంస్థను బొంద పెట్టడానికి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని వెల్లడించారు. బొగ్గు గనులను వేలం వేయడం అంటేనే సింగరేణిలో ఉపాధి అవకాశాలను లేకుండా చేయటం అని పేర్కొన్నారు. సింగరేణి మేధావులుగా గుర్తించబడిన క్లరికల్ సోదరులు పెద్ద ఎత్తున భావజాల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. ఎం ఎం డి ఆర్ 2017 చట్ట సవరణకు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందని కాంగ్రెస్, బిజెపి పార్టీలు ప్రచారం చేస్తున్నాయని దమ్ముంటే నిజనిర్ధారణకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. గోదావరిఖని 1,2, 2ఎ,11, ఓసిపి 5, సివిల్, సెక్యూరిటీ, హాస్పిటల్ ఏరియా వర్క్ షాప్ జిఎం కార్యాలయం లో పనిచేస్తున్న కార్మికులు వేలంపాటను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రజల ఉపాధి కార్మికుల ఉద్యోగ భద్రత కోసం కదం తొక్కారు.
ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, కేంద్ర నాయకులు ఎల్ వెంకటేష్, పోలాడి శ్రీనివాసరావు, ప్రవీణ్, ఐ.సత్యనారాయణ, రాజేశం, దూట శేషగిరి, వివిధ గనుల కార్యదర్శులు బొగ్గుల సాయి, ఉప్పులేటి తిరుపతి, దిడ్డి లక్ష్మణ్ , గోపి, పల్లె సురేందర్, వాసర్ల జోసెఫ్, పులిపాక శంకర్, జనగామ మల్లేష్, రొడ్డ సంపత్, నూతి రాజ్ కుమార్, కళాధర్ రెడ్డి, గడ్డి శ్రీనివాస్, కొండ్ర అంజయ్య, పర్ల పెళ్లి అభిషేక్, లక్ష్మణ్, రాజు, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TBKS protested by wearing black badges on all mines in Rg1 area