TRINETHRAM NEWS

P Avinash Mahanthi : సన్ బర్న్‌కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

హైదరాబాద్: సన్ బర్న్ పార్టీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. సన్ బర్న్ కోసం ఇప్పటికీ అనుమతులు కోసం దరఖాస్తు చేసుకోలేదన్నారు..

అనుమతి లేకుండా టికెట్లు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. బుక్ మై షో ప్రతినిధులను పిలిచి హెచ్చరించామన్నారు. అనుమతులు లేకుండా టికెట్లు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పానని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. న్యూ ఇయర్ ఈవెంట్ల కోసం ఎవరైనా అనుమతులు తీసుకోవాల్సిందేని సీపీ వెల్లడించారు..