P Mallikarjun sworn in as President of Lions Club
రామగుండం లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి 53వ ఇన్స్టాలేషన్ సెర్మని నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి గాను నూతనంగా అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ బి ఎల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి లతో పాటు కార్యవర్గాన్ని ముఖ్య అతిధులు సింహరాజు కోదండరాం ప్రమాణ స్వీకారం చేయించారు. విశిష్ట అతిధులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద హాజరై రామగుండం లయన్స్ క్లబ్ చేస్తున్న పేదవారికి అన్న ప్రసాదం, కృత్రిమ అవయవాల పంపిణీ, కంటి ఆపరేషన్లు తదితర సేవలను కొనియాడారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మాజీ గవర్నర్లు మినేష్ నారాయణ్ టండన్, ముద్దసాని ప్రమోద్ కుమార్ రెడ్డి, రేకులపల్లి విజయ, తానిపర్తి విజయలక్ష్మి, బంక రామస్వామి, బంక కళావతి, మనిషా అగర్వాల్, కె రాజేందర్, మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి లతోపాటు వివిధ క్లబ్ ల నుండి అధిక సంఖ్యలో లయన్ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App