ANC registration of 100 percent pregnant women should be completed District Collector Koya Harsha
వంద శాతం గర్భిణీ స్త్రీల ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*కూనారం,శ్రీరాంపూర్ పి.హెచ్.సి ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కూనారం, శ్రీరాంపూర్, జూన్-28: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వంద శాతం గర్భిణీ స్త్రీల ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్, కూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలించారు .
oకూనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జూన్ మాసంలో 20 మంది గర్భిణీ స్త్రీల ఏ.ఎన్.సి రిజిస్ట్రేషన్, 10 మంది గర్భిణీ స్త్రీల ప్రసవాలు నిర్వహించామని, 7 మంది పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యాధికారి తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణీ స్త్రీల ఏ.ఎన్.సి. రిజిస్ట్రేషన్, చెక్ అప్ వంద శాతం జరిగేలా చూడాలని, క్షేత్రస్థాయిలో పని చేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పని చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతి రోజు జరుగుతున్న ఔట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్న కలెక్టర్, ఔట్ పేషెంట్ లకు పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డిప్యూటీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కృపా బాయి, కూనారం వైద్యాధికారి డాక్టర్ భావన, శ్రీరాంపూర్ వైద్యాధికారి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App