District Collector Koya Harsha made a surprise inspection of the Tehsildar offices
పాలకుర్తి, అంతర్గాం, రామగుండం
జూన్ 21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపెల్లి జిల్లాలో ఉన్న మూడు మండలాల తహసిల్దార్ కార్యాలయాలను జిల్లా కలెక్టర్ కోయ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండల తహసిల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు.
తహసిల్దార్ కార్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది, వారి విధుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలం పరిధిలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తుల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.
ప్రతి మండలం పరిధిలో నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని దాని ప్రకారం పెండింగ్ ధరణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా ధరణి దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ప్రతి మండలంలో అధికంగా సమస్యలు ఉన్న గ్రామాల వివరాలను తెలుసుకున్న కలెక్టర్ వాటి పరిష్కారానికి అనుసరించా ల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. మండలాల పరిధిలో ఎక్కడా అక్రమంగా ఇసుక, మట్టి తరలింపు జరగకుండా తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App