Pawan took charge as Deputy CM
ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం ఉదయం 10.53 నిమిషాలకు ఆయన విజయవాడలోని జలవనరుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, శాస్త్ర, సాంకేతిక, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా రెండు ఫైల్స్ పై పవన్ సంతకం చేశారు. ఉపాధి హామీ పథకానికి ఉద్యాన వన పనులను అనుసంధానించి నిధులు మంజూరుపై తొలి సంతకం, గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణంపై రెండో సంతకం చేశారు.
కాగా మరి కాసేపట్లో పవన్.. ఐఏఎస్, ఐపీఎస్ అదికారులతో భేటీ అవుతారు. అటవీ సంరక్షణ, అక్రమ రవాణా, ఎర్రచందనం పరిరక్షణ వంటి వాటిపై ఆయన చర్చించనున్నారు.
అదేవిధంగా పంచాయితీరాజ్ శాఖకు చెందిన ఎన్జీవో సంఘాలతోనూ పవన్ భేటీ కానున్నారు. పంచాయతీరాజ్ శాఖలో చేపట్టాల్సిన కార్యక్రమాలు ప్రస్తుతం పెండింగులో ఉన్న అంశాలపై చర్చించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App