TRINETHRAM NEWS

Arrest of the accused who are committing thefts

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

2 ¼ తులాల బంగారం, 15 తులాల వెండి పట్టీలు మరియు 2,44,660/- రూపాయలు స్వాధీనం

గత కొద్ది నెలలు గా మంచిర్యాల జిల్లా లోని హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలలో మరియు జగిత్యాల జిల్లాల లోని పలు మండలలో జల్సా లకు అలవాటుపడ్డ నిందితుడు సులువుగా డబ్బులు సంపదించుకోవటానికి రాత్రి సమయం లో ఇంటి బయట పడుకొని ఇంటికి తాళం వేసి ఉన్న ఇండ్లను గమనించి రాత్రి పూట ఇంటి లోకి చొరబడి దొంగతనలకు పాల్పడుతున్న నిందితుని పట్టుకోవడం కోసం రామగుండం సిపి ఆదేశాల మేరకు మంచిర్యాల డిసిపి ఉత్తర్వులు ప్రకారం మంచిర్యాల ఏసిపి పర్యవేక్షణలో మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ మరియు హాజీపూర్ ఎస్సై సురేష్ గార్ల ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవడం కొరకు రెండు ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది.

నిందితులను పట్టుకోవడంలో భాగంగా ఈరోజు తేదీ 08.06.2024 రోజున మధ్యాహ్నం 01:15 గంటల సమయం లో గుడిపేట లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కు పోయే దారి వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించగా వెంటనే అట్టి ఇద్దరు వ్యక్తులను విచారించగా వారు వారి పేర్లు ఖంభంపాటి యెసొబు @ అంగందుల సురేశ్ రెడ్డి S/o రాములు, వయస్సు: 41 సంII, కులం: మాదిగ, వృత్తి: కూలీ, ఆత్కూర్, మధిర మండలం ఖమ్మం జిల్లా అని తెలిపి గత ఆరు నెలలుగా హాజీపూర్ మండలం, లక్సెట్టిపేట మండలo లోని పలు ఇండ్లలో మరియు జగిత్యాల జిల్లాల లోని పలు మండలాలలో దొంగతనం చేసినాను అని అట్టి దొంగతనం చేసిన బంగారం, వెండి ఆభరణాలను ముమ్మడ్వార్ రాహుల్ S/o నరేంద్ర, వయస్సు: 29 సంII, కులం: ఔసుల, వృత్తి: గోల్డ్ స్మిత్, నివాసం: కానపూర్, సోనార్ కాలనీ, ఆదిలాబాద్ స్వంత గ్రామం పఠాన్ బోరి గ్రామం, కేలపూర్ తాలూకా, యావత్మాల్ జిల్లా, మహారాష్ట్ర అను వ్యక్తికి ఇస్తాను అని తెలపడం జరిగింది.

హాజీపూర్ పోలీసు వారు అట్టి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోని వారిని తనిఖీ చేయగా అట్టి ఇద్దరు వ్యక్తుల వద్ద నుండి 2 ¼ తులాల బంగారం, 15 తులాల వెండి పట్టీలు మరియు 2,44,660/- రూపాయలు లను జప్తు చేసి వారిద్దరిని రిమాండ్ కు తరలించనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Arrest of the accused who are committing thefts