We will continuously fight against Modi’s frauds
దేశంలో మోడీ ఇమేజ్ తగ్గింది..
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
యువశక్తిని నిర్వీర్యం చేసిన బీజేపీ..
కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం..
కాంగ్రెస్ ను గెలిపించిన ప్రజలందరికి కృతజ్ఞతల
నరేంద్ర మోడీ మోసాలపై కాంగ్రెస్ ఆద్వర్యంలో ప్రజల పక్షాన పోరాడుతామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు తెలిపారు. పెద్దపల్లిలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. 10ఏళ్ల పాలనలో దేశంలోని సామాన్య ప్రజలకు ప్రధానిగా మోడీ ఏం చేశారని ప్రశ్నించారు.
ఏడాదికి 2 కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోడీ యువతను మోసం చేశారని విమర్శించారు. యువశక్తిని నిర్వీర్యం చేసిన బీజేపీకి దేశంలో ఆదరణ తగ్గిందని అన్నారు. రాహుల్ గాంధీ యాత్ర ద్వారా చేసిన పోరాటం ఫలించిందన్నారు.
రాహుల్ భావి భారత ప్రధాని కావడం ఖాయమన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీ అయోధ్య రామ మందిరం నిర్మాణం, అక్షింతల పేరిట ప్రజలను మతం పేరుతో ఆకర్షించేందుకు కుట్ర చేసి లబ్ధి పొందారని దుయ్యబట్టారు. ప్రధానిగా మోడీ దేశ ప్రజలకు చేసిన మేలు ఏంటిదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ పూర్తిగా ఉనికిని కొల్పోయిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామిని నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. పెద్దపల్లిలో త్వరలోనే బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు తెచ్చి భూసేకరణ, రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం.
ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో 165 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 27762 మంది రైతుల నుంచి రూ. 392.26 కోట్ల విలువ చేసే 17,87,101 క్వింటాళ్ల ధాన్యం కొన్నట్లు ప్రకటించారు.కొన్న 3 రోజుల్లోనే ధాన్యం డబ్బులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పటివరకు 26,852మంది రైతులకు రూ,364.33 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు.
నూరు శాతం కొనుగోళ్లు పూర్తి చేసి 93 శాతం చెల్లింపులు చేశామన్నారు. గృహవసరాలకు ఉచితంగా ఇసుక తీసుకెళ్ళేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపుకు సహకరించిన ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ వంశీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సమావేశంలో భూషనవేని సురేష్ గౌడ్, కడార్ల శ్రీనివాస్, జెడ్పీటీసీ బండారి రాంమూర్తి, గోపగాని సారయ్య గౌడ్, నూగిల్ల మల్లయ్య, భుతగడ్డ సంపత్, సయ్యద్ మాస్రత్, సందనవీని రాజేందర్, మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, చిలుక సతీష్, సింగిల్ విండో చైర్మన్లు ఆళ్ళ సుమన్ రెడ్డి, మాదిరెడ్డి నర్సింగ్ రెడ్డి, చింతపండు సంపత్, శ్రీగిరి శ్రీనివాస్, శాయిరి మహేందర్, వెగోలపు అబ్బయ్య గౌడ్, గండు సంజీవ్, ఎండీ.
సర్వర్, పాగల శ్రీకాంత్, ఎరుకల రమేష్, తూముల సుభాష్ రావు, బొద్దుపల్లి శ్రీనివాస్, జగదీష్, తాండ్ర శ్రీమాన్, ఉప్పు రాజు, ఈర్ల స్వరూప, దేవరకొండ రాజు, అశ్లాం, అజ్గార్, రేగుంట అశోక్ గౌడ్, ఆర్కుటి సంతోష్, రమేష్, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App