TRINETHRAM NEWS

Cool talk for Telugu states

Trinethram News : 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం..

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి.

వేసవి ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది.

ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఆంధ్రపదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4రోజులలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు.

నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది వాతావరణశాఖ.

మరోవైపు నేడు మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Cool talk for Telugu states