WhatsApp Image 2024 05 29 at 18.34.56
Arrest of accused who is committing theft
మే 29, రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్
చోరీలకు పాల్పడుతున్న సల్పల శ్రీనివాస్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్లు
రామగుండం సీపీ ఎం. శ్రీనివాస్ తెలిపారు. బుధవారం జైపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిందితుని వద్ద నుండి 3 తులాల బంగారు నెక్లెస్‌లు, 9 తులాల బంగారు గొలుసులు, 2 బంగారు మాటీలు, 2 ఇయర్ రింగ్స్, మూడు బంగారు ఉంగరాలు, 6 తులాల వెండి కాళ్ళ పట్టిలు, రూ. 2, 62, 600 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
