TRINETHRAM NEWS

Awareness should be raised about the new laws

పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కమీషనరేట్ అధికారులకు, సిబ్బంది కి వర్కుషాప్ నో న్యూ క్రిమినల్ లాస్ (నిసీల్) పై అవగాహన కార్యక్రమం
నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రామగుండం కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరిజ్ఞానం ఉండాలన్నారు.

దానిలో భాగంగా రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జోన్ అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించేలా రామగుండం పోలీస్ కమీషనరేట్ లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అని రామగుండం కమీషనర్ శ్రీ ఎం.

శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) తెలిపారు ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..ప్రతి పోలీసు అధికారికి, సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన ఉంటేనే రానున్న రోజుల్లో బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎలా స్వీకరించాలి, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి, స్టేషన్ బెయిల్ కు ఎవరు అర్హులు, చార్జీషీట్ ఎలా తయారు చేయాలి, నిందితులకు శిక్షలు ఖరారు చేయ డంలో దర్యాప్తు అధికారులు ఎలా వ్యవహరించాలి తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారు అన్నారు. భారత న్యాయ వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదనీ, అవసరాన్ని బట్టి ప్రజా భద్రత కోసం ఎన్నో చట్టాల రూపకల్పన జరిగిందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వంటి అంశాలతో శాంతిభద్రతల పరిరక్షణలో మైలురాయిగా నిలుస్తోందన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు వీలు దొరుకుతుందన్నారు. ప్రతి ఒక్కొరూ నూతన అంశాలను నేర్చుకోవాలని సూచించారు.

ఇంత కాలం పాటిస్తున్న పాత విధానాలలో నూతన ధి చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ పాటించకూడదని, నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే వివిధ రకాల కేసులను నమోదు చేయా లని చేయాల్సి ఉంటుందని సీపీ సూచించారు
కమీషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు, సిబ్బంది కి తెలంగాణ పోలీస్ అకాడమీ లో నూతన చట్టలపై శిక్షణ పొందిన అధికారులతో బ్యాచ్ ల వారిగా నెల రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని సీపీ తెలిపారు ఈ కార్యక్రమం లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్,సిసిఅర్బీ ఇన్స్పెక్టర్ బుద్దె స్వామి, కమీషనరేట్ పరిధిలోని సీఐ, ఎస్ఐ లు, సిబ్బంది పాల్గొన్నారు

Awareness should be raised about the new laws