May 30 Celebrate CITU’s 54th Foundation Day
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కామ్రేడ్ కే భూపాల్ సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు
సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 2024 మే 25, 26 తేదీలలో గోదావరిఖనిలోని శ్రామిక భవన్లో జిల్లాస్థాయి నాయకత్వ శిక్షణా తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణా తరగతులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కే భూపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, లేబర్ కోడ్ లు అంశాలపై బోధించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 1970లో కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు ఆవిర్భవించింది. సిఐటియు ఆవిర్భవించి 54 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలు ఆవిర్భావ దినోత్సవాన్ని సెమినార్లు సదస్సులు ఏర్పరిచి ఘనంగా నిర్వహించచాలి. సిఐటియు నినాదమైన “ఐక్యత-పోరాటం”, కార్మిక హక్కులకై సమరశీల పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఇప్పుడు జరుగుతున్న 18వ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. అనంతరం ఏ ప్రభుత్వము ఏర్పడిన భారత కార్మిక వర్గ హక్కులపై బి.ఎం.ఎస్ మినహా కలిసివచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని సమరశీల పోరాటాలకు సంసిద్ధులు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 74 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాలను పెంచకుండా కేవలం బేసిక్ లో కరువు భత్యం (డిఎ)ను కలిపి నూతన జీవోలు విడుదల చేయడం దురదృష్టకరం సిఐటియు కనీస వేతనం 26,000 ఉండాలని డిమాండ్ చేస్తుంది. ఈ హక్కును సాధించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా కూడా పోరాటం చేయనున్నది.
కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వమైనా, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వమైనా కార్మిక సంఘాల తో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి కార్మికుల డిమాండ్లను చర్చించి పరిష్కరించాల్సిందిగా కోరారు.
మొదటి రోజు శిక్షణ తరగతిలో “సామాజిక పరిణామం” అనే అంశాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ వేల్పుల కుమారస్వామి, “శ్రమ-దోపిడి” అంశాన్ని జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ఎన్ బిక్షపతి గారలు మరియు రెండవ రోజు “నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు- లేబర్ కోడ్లు” అనే అంశం ను రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ కే భూపాల్, “సిఐటియు విశిష్టత కార్మిక సంఘాల నిర్మాణం” అంశాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ ముత్యం రావు గారలు బోధించారు.
ఈ శిక్షణా తరగతులకు కామ్రేడ్ ఎన్ బిక్షపతి ప్రిన్సిపాల్ గా వ్యవహరించారు. ఈ శిక్షణ తరగతులలో పెద్దపల్లి జిల్లాలోని సిఐటియు అనుబంధం కార్మిక సంఘాలు సింగరేణిలోని పర్మనెంట్, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, ఎన్టిపిసి ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, మున్సిపల్, గ్రామపంచాయతీ నాయకులు, రైల్వే కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు సుమారు 60 మంది తో పాటు నాయకులు జి జ్యోతి, ఏం రామాచారి, మెండే శ్రీనివాస్, గీట్ల లక్ష్మారెడ్డి, నాంసాని శంకర్, ఎస్ వెంకటస్వామి వి నాగమణి, ఉల్లి మొగిలి, వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App