IFTU Condemn Modi Govt’s Genocidal Military Attacks on Adivasis
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
భారత ప్రభుత్వం ఆదివాసీలపై జరుపుతున్న నరహంతక సైనిక దాడులను తక్షణమే రద్దు చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య(ఐఎఫ్ టుయు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్ద పల్లి జిల్లా అధ్యక్షులు ఈసం పల్లి రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఐ ఎఫ్ టి యు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ నక్సలైట్ల సాకుతో స్వదేశీ విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకు ప్రధానంగా ఆదాని, అంబానీలకు నిక్షిప్తం ఖనిజ సంపదను దోసి పెట్టడానికి, వారికి ఆర్థిక ప్రయోజనాలను సమకూర్చే లక్ష్యంతో “ఆపరేషన్ కగార్” పేరుతో ఆదివాసీలను వేరువేసే ప్రక్రియలో భాగంగా 2024 జనవరి నుండి నేటి వరకు 120 మంది ఆదివాసి గిరిజన ప్రజలను కనీసం కనికరం లేని అత్యంత అమానుషంగా అమానవీయమైన రీతిలో ఆరు నెలల పాప మొదలు 18 సంవత్సరాల యువతి యువకుల ను భారత ప్రభుత్వం హత్య చేసిందని, ఈ మారుణహోమం పెద్ద ఎత్తున నేటికీ కొనసాగుతుందని అందులో భాగంగానే 29 మంది ఆదివాసి యువతీ యువకులను ఆదివాసీ హక్కుల కోసం నిస్వార్ధంగా నిజాయితీగా ఎంతో అంకితభావంతో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీకి చెందిన వారిని దారుణంగా హత్య చేసి ఎదురు కాల్పుల పేరిట ప్రకటించడం దుర్మార్గమని పేర్కొన్నారు స్వదేశ పౌరుల పైన యుద్ధం ప్రకటించిన బ్రాహ్మణీయ హిందుత్వం ఫాసిస్ట్ భారత ప్రభుత్వం అత్యంత దుర్మార్గ చర్యలను ఖండించవలసిందిగా కార్మిక వర్గానికి ప్రజలకు ప్రజాస్వామీకువదులకు మేధావులకు ఆయన విజ్ఞప్తి చేశారు ఆదివాసీలు భారత రాజ్యాంగం కల్పించిన ఐదవ ఆరవ షెడ్యూల్ ఆధారంగా వచ్చిన చట్టాల కనుగుణంగా తమ హక్కుల కోసం అస్తిత్వం కోసం పోరాడుతున్నారని న్యాయమేనా పోరాటానికి మద్దతు ఇవ్వాలని సంఘటితంగా నిలవాలని వారిపై జరుగుతున్న సైనిక దాడుల కు వ్యతిరేకంగా గొంతు విప్పాలని కోరారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే ఈ దేశానికి అన్నం పెట్టి రైతాంగం పైన కార్మికుల పైన ఇప్పటికే దాడిని ప్రారంభించింది అని జీవించే హక్కును రద్దు చేసే ప్రక్రియల భాగంగా చైతన్యానికి భూమిపై హక్కు ను నిరాకరించి వ్యవసాయ రంగాన్ని కంపెనీ వ్యవసాయంగా మార్చే మూడు సాగు నల్ల చట్టాలను కార్మిక వర్గం హక్కులను హరణం హనం చేసే నాలుగు లేబర్ కోడ్సను ముందుకు తెచ్చిందని రాజ్యాంగాన్ని రద్దుచేసి మన స్మృతి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్న కాశ్మీర్ కున్న స్వయంప్రతి పత్తిని కల్పించే 370 ఆర్టికల్ రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది ఈశాన్య రాష్ట్రాల్లో ఆదివాసి తెగల జాతుల మధ్య మంటలు రేపింది సి ఏ ఏ ఉమ్మడి పౌరస్మృతి వంటి ప్రజా వ్యతిరేక విధానాల ను అమల్లోకి తెచ్చిందని ని ఆందోళన వ్యక్తం చేశారు ఆపరేషన్ నిరసనగా పౌర మానవ హక్కుల సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమం లో పాలుగోనాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టు యు జిల్లా అధ్యక్షులు ఈసం పల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ, ఉపాధ్యక్షలు గుండెటి మల్లేశం, కోశాధికారి నాగ బూషణం, సహాయ కార్యదర్శి పుట్ట పాక స్వామి, జిల్లా కమిటీ సభ్యులు సంబోజి ప్రసాద్, రాజనర్సు, చింతల శేఖర్ లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App