All India Ambedkar Youth Association
పెద్దపల్లి జిల్లా
గోదావరిఖని
త్రినేత్రం న్యూస్ (ప్రతినిధి)
తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాదరి భాగ్యరెడ్డి వర్మ గారి 136వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది,
అణగారిన వర్గాలకు,దిక్సూచి, భాగ్య రెడ్డి వర్మ
కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షురాలు సీనియర్ అడ్వకేట్ శ్రీమతి ఎం, వరలక్ష్మి
భారతదేశంలోని అణగారిన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన మాల సామాజిక వర్గానికి చెందిన మహోన్నతుడు వర్మ బిరుదంకితుడు, మాదరి భాగ్యరెడ్డి వర్మ అని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్,కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షురాలు సీనియర్ అడ్వకేట్, శ్రీమతి ఎం,వరలక్ష్మి అన్నారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరిఖని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్,లో,మాదరి భాగ్యరెడ్డి వర్మ గారి 136వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు, బాబాసాహెబ్ అంబేద్కర్ కు సమకాలికుడిగా పేరున్న భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ స్టేట్స్ నిజాం పాలన కాలంలో అనగారిన వర్గాల కోసం, విద్య సాంస్కృతిక, రాజకీయ చైతన్యం కోసం కృషిచేసిన మహోన్నతుడన్నారు, దళిత వర్గాల కోసం మొదటిసారిగా హైదరాబాద్ స్టేట్స్ లో పాఠశాలలు నెలకొల్పి విద్యను అందించిన భాగ్యరెడ్డి నిజాం ప్రభుత్వం వర్మ పేరిట బిరుదు ఇచ్చి సత్కరించిందన్నారు, ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని పిలుపునిచ్చారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ, సభ్యులు బొంకూరి మధు జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి మంతెన లింగయ్య మాట్లాడారు అణగారిన దళిత వర్గాల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలను కొనియాడారు, ప్రభుత్వపరంగా నిర్వహించాల్సిన కార్యక్రమమైనప్పటికీ
ఈ ప్రాంతంలో భాగ్యరెడ్డి వర్మ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం బాధాకరమన్నారు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కన్వీనర్ శ్రీ బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, జిల్లా కో కన్వీనర్ దుబాసి బొందయ్య, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు కొండ్ర వెంకటేష్ పెరిక రవి కాజీపేట పోచం,గద్దల నవీన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App