జూన్ 27, 2026

WhatsApp Image 2024 03 25 at 22.34.38

TRINETHRAM NEWS

హైదరాబాద్‌: తెలంగాణలో హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా, పెద్దా రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌లోని తన నివాసంలో మనవడు రేయాన్స్‌తో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు..

భార్య గీతారెడ్డితో కలిసి మనవడిపై రంగులు చల్లుతూ ఉత్సాహంగా కనిపించారు. తాత ఒళ్లో కూర్చుని రేయాన్స్ చిరునవ్వులు చిందించాడు. దీనికి సంబంధించిన ఫొటోలను సీఎం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ” పరిపాలన, రాజకీయం, విజ్ఞప్తులు, పరిష్కారాలు, సమావేశాలు, తీరిక లేని షెడ్యూల్ అన్నింటికీ కొంచెం విరామం. హోలీ నాడు.. మనవడితో ఆటవిడుపు” అంటూ రాసుకొచ్చారు..

You cannot copy content of this page