WhatsApp Image 2024 03 14 at 09.42.21
Trinethram News : Group-1: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (గురువారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత నెల 19న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది..
ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను టీఎస్పీఎస్సీ స్వీకరిస్తోంది. అయితే, ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు TSPSC అధికారులు వెల్లడించారు..
కాగా, గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక, ఇవాళే.. చివరి రోజు కాబట్టి ఒక్క రోజులో ఎంతలేదన్నప్పటికీ మరో 50 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది..
