WhatsApp Image 2024 03 13 at 10.46.52 PM
Trinethram News : Mar 13, 2024,
వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్‌ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది.
