TRINETHRAM NEWS

గ్రామీణ ప్రాంత కుల వృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతి.

భువనగిరి డిసెంబర్20: చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అంది స్తుందన్నారు.

పోచంపల్లి వరంగల్ సిరి సిల్ల వస్త్రాలకు ట్యాగ్రావడం అభినందనీయమన్నారు పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలి గిందన్నారు. భారత సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటన్నారు యుఎన్ఎ భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినంద నీయమన్నారు.

ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతుదొ రుకుతుందన్నారు చేనేత వస్త్రాల కృషి గొప్పదన్నారు కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్పది అభినందనీయ మన్నారు.

ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించడం గొప్ప కళాకారుల లక్ష్యమని చేనేత రంగాన్ని ముందుకు తీసు కెళ్తున్న అవార్డు గ్రహీతలం దరికీ నాశుభాకాంక్షలు ధన్యవాదాలన్నారు.

చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమన్నారు చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అధికారులు మరింత చొరవచూపా లన్నారు.

చేనేత అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలన్నారు తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకు వస్తానన్నారు.

రాష్ట్రపతి పోచంపల్లి పర్యటన సందర్భంగా రాష్ట్రపతికి మంత్రి సీతక్క ప్రభుత్వవిప్ బిర్ల ఐలయ్య భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి త్వశాఖ సెక్రటరీ రచన సాహు, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టి పోలు విజయ లక్ష్మిలు ఘన స్వాగతం పలికారు.