ఈ నెల 11న భద్రాచలానికి సీఎం రేవంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్..

ఈ నెవ11న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకోనున్నారు..

ఆ తర్వాత జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం మణుగూరులో జరిగే ‘ప్రజా దీవెన’ సభలో సీఎం పాల్గొంటారు..

ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో తో కలెక్టర్ ప్రియాంక అల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు..

You cannot copy content of this page

Scroll to Top