నిజాంపేట్ ఎస్ఆర్ డిజి స్కూల్లో సైన్స్ ఫెర్ ప్రారంభించి డిప్యూటీ మేయర్,కార్పొరేటర్

TRINETHRAM NEWS

Trinethram News : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ ఎస్ఆర్ డిజి స్కూల్ లో విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటు చేయించిన సైన్స్ ఫెర్ కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, కార్పొరేటర్ సురేష్ రెడ్డి, సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్,ఎస్ఆర్ డిజి స్కూల్ వైస్ ప్రిన్సిపల్ చందన ప్రియా గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్కు సంబంధించిన తయారుచేసిన పరికరాలను పరిశీలించారు. అలాగే విద్యార్థిని విద్యార్థులతో సైన్స్ ఫేర్ చేయించిన ఉపాధ్యాయులను అభినందించారు. ఇటువంటివి చేయించడం ద్వారా విద్యార్థులకు తెలియని విషయాలు కూడా తెలుసుకుని మేధాశక్తిని పెంచుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top