TRINETHRAM NEWS

బంపర్ ఆఫర్..రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు..రూ.10 వేలకు 15వేలు ఇచ్చారు….? షోషల్ మీడియా వాడే వారు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిక…

హైదరాబాద్‌లో ఉన్న ఓ వ్యక్తికి టెలిగ్రామ్ ద్వారా ఒక మెసేజ్ వచ్చింది. @Moz00001 టెలిగ్రామ్ ఐడి నుంచి ఒక పార్ట్ టైం జాబ్ ఆఫర్ పేరుతో మెసేజ్ చేశాడు. కొన్ని రెస్టారెంట్లతోపాటు కొన్ని ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి వీటికి గూగుల్లో రివ్యూ ఇవ్వాల్సిందిగా చెప్పాడు. రివ్యూ ఇచ్చే సమయంలో ఆ ఫోటోను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ టెలిగ్రామ్‌లో పంపిస్తే దానికి డబ్బులు చెల్లిస్తామని నమ్మించారు. ఇంట్లో కూర్చుని ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అనుకున్నడు బాధితుడు.. సైబర్ నెరవేళ్ళు టెలిగ్రామ్ లో పంపిన పార్ట్ టైం జాబ్ లింకును క్లిక్ చేసి అందులో ఇచ్చిన ఫోటోలకి రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టాడు. రివ్యూ ఇచ్చిన వెంటనే ఆ ఫోటోలను స్క్రీన్ షాట్ తీసి మళ్లీ నిందితుడికి టెలిగ్రామ్ లో పంపించాడు. అలా మొదలైన బాదితుడి ప్రయాణం కొద్ది రోజులకి టాస్కుల వరకు వచ్చింది. తాము ఇచ్చిన టాస్కులన్నీ పూర్తి చేస్తే డబ్బులు వస్తాయని నమ్మించారు.

తర్వాత కొంచెం డబ్బు ఇన్వెస్ట్ చేస్తే దాని నుంచి ఎక్కువ సంపాదించవచ్చు అని బాధితుడుని నమ్మించారు. దీంతో బాధితుడు మొదట ఒక పదివేల రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. కొన్ని గంటల్లోనే పదివేల రూపాయలకు బదులు 15 వేల రూపాయలు తిరిగి బాధితుడికి నిందితులు చెల్లించారు. దీంతో ఇది నిజమేమోనని నమ్మిన బాధితుడు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడు. అలా బాధితుడిపెట్టుబడి వేలు దాటి లక్షల రూపాయల వరకు వెళ్ళింది.

బాధితుడు చేస్తున్న లావాదేవీని మొత్తం గమనించిన నిందితులు ఒక్కసారిగా అతడి అకౌంట్ ను బ్లాక్ చేసేసారు. ఆ డబ్బును మొత్తం తమ ఖాతాల్లోకి బదిలీ చేసేసుకున్నారు.. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఇప్పటివరకు తాను పెట్టుబడి పెట్టిన మొత్తం నగదు 2.16 లక్షల రూపాయలకు గుర్తించారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్క్ పేరుతో వచ్చే ఆఫర్లను నమ్మవద్దంటూ ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా కేంద్రంగా వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని ప్రజలకు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ బారిన పడి మోసపోయి ఉంటే వెంటనే స్థానిక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించండి లేదా 1930 ద్వారా ఫిర్యాదు చేయండి లేదా cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీసులు తెలిపారు.