Trinethram News : నంద్యాల జిల్లా మార్చి06
నంద్యాల జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల దగ్గర ఘటన చోటు చేసుకుంది.
మృతులు హైదరాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరంతా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది..
ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది…