జూన్ 26, 2026

WhatsApp Image 2024 03 03 at 09.47.06

TRINETHRAM NEWS

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధి భౌరంపేట్ లో ఈరోజు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సంధర్భంగా కౌన్సిలర్ గారు మాట్లాడుతూ నిండు జీవితాన్ని కేవలం రెండు చుక్కలతో కాపాడుకోవచ్చని తెలిపారు. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించి , పిల్లల అంగ వైకల్యం రాకుండా కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సరిత గారు మరియు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page