హైస్కూల్ పిల్లల్ని కిడ్నాప్ కు యత్నింంచిన దుండగులు….
ప్రకాశం :- కురిచేడు మండలం బోధనంపాడు ZPH స్కూల్ పిల్లలు స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వెలుతున్న తరుణం లో స్కూల్ పిల్లలు దగ్గర గుర్తు తెలియని కారు ఆపి పిల్లల్ని పట్టుకోవడానికి ప్రయత్నించిన దుండగులు నుంచి తప్పించుకొని స్కూల్ హెడ్ మాస్టర్ కు విషయం తెలియజేయడం తో కురిచేడు యస్సైకు సమాచారం తెలియజేసారు. నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెలుతుంటే చింత చెట్టు దగ్గర గుర్తు తెలియని మొబైల్ కనిపించిందని ఆ మొబైల్ రింగ్ అవుతుంటే మొబైల్ లిఫ్ట్ చేశామని మాట్లాడితే మాది కురిచేడు వెంకట కోటిరెడ్డిని నా మొబైల్ నేను వచ్చి తీసుకెళతాను అని మాట్లాడుతుండటంతో మొబైల్ మరో పాపకు ఇవ్వడం తో మాది తెలంగాణ అని ఆ పాపతో మహిళ మాట్లాడటంతో ఆ మొబైల్ ను ఆ చెట్టు దగ్గర వదిలి నిన్న ఇంటికి వెళ్లి ఈరోజు అదే చెట్టు దగ్గర మొబైల్ చూడటం తో ఆ మొబైల్ లేదని స్కూల్ పిల్లలు తెలిపారు.సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి పోతుంటే అదే చెట్టు దగ్గర కారు ఆపి గుర్తు తెలియని వ్యక్తి దిగి పట్టుకో బోతే ఆ కారు లో ఒక మహిళ కాపాడండి కాపాడండి అని కేకలు వేసినట్లు విద్యార్థినులు తెలిపారు.